రాయలసీమ కోటాలోనే కిరణ్ కుమార్ రెడ్డికి సిఎం పదవి: సర్వే

Survey Satyanarayana
హైదరాబాద్‌: రాయలసీమ కోటాలనే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాదులో పుట్టి పెరిగినా రాయలసీమ కోటా కిందికే వస్తారని, హైదరాబాదులో ఏ ప్రాంతానికి చెందినవారైనా ఉండవచ్చునని ఆయన అన్నారు. ఓ ప్రైవేట్ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో ఆయన గురువారం మాట్లాడారు. ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన దీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాల మేరకే కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గ కూర్పు ఉంటుందని ఆయన చెప్పారు.

తనకు ముఖ్యమంత్రి పదవి కావాలని కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ అడగడం లేదని ఆయన అన్నారు. రాజీవ్ గాంధీ హంతకుల పట్ల కూడా సోనియా క్షమాగుణాన్ని ప్రదర్శించారని, మంచిగా నడుచుకుంటే వైయస్ జగన్ ను కూడా క్షమిస్తారని ఆయన అన్నారు. వైయస్సార్ మంత్రివర్గం, రోశయ్య మంత్రివర్గం అంటూ వేరుగా లేవని ఆయన అన్నారు. తెలంగాణకు ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కాంగ్రెసుతో పొత్తు పెట్టుకోవడానికి సంబంధం లేదని, తమ సిద్ధాంతాలు నచ్చి కలిసి వస్తే తాము ఆహ్వానిస్తామని, డిఎంకె లాగా ఉంటామని చంద్రబాబు వచ్చినా తమకు అభ్యంతరం ఉండదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+