శాఖల కేటాయింపులో అసంతృప్తి మాట నిజమే: డిఎస్

Srinivas
హైదరాబాద్: మంత్రివర్గ కూర్పు అనంతరం పలువురిలో అసంతృప్తి జ్వాలలు నిజమేనని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి డి శ్రీనివాస్ గురువారం అన్నారు. ఇంత పెద్ద పార్టీలో అందరినీ సంతృప్తి పరచటం సాధ్యం కాదన్నారు. ఆయా శాఖల కేటాయింపుపై పలువురిలో ఏర్పడిన అసంతృప్తిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో చర్చిస్తానని డి. శ్రీనివాస్ చెప్పారు. ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని అందరినీ సముదాయిస్తామని చెప్పారు.

తనకు కేటాయించిన శాఖపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి అన్నారు. అందరమూ కలిసి కట్టుగా పని చేస్తామన్నారు. తనకు కేటాయించిన శాఖపై అసంతృప్తితో ఉన్నప్పటికీ తాను రాజీనామా చేయలేదని మరో మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. కాసుకు సహకారం, రాంరెడ్డి వెంకటరెడ్డికి ఉద్యానవన శాఖ కేటాయించిన విషయం తెలిసిందే. మంత్రులలో అసంతృప్తి ఏమీ లేదని త్వరలో అది అంతా సర్దుకు పోతుందని హోంమంత్రి సబితారెడ్డి ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+