బలహీనుడననే నాకు మంత్రి పదవి ఇవ్వలేదు: జెసి దివాకర్ రెడ్డి

కాగా ధర్మాన ఇంటిలో భేటీ అయిన అసంతృప్త మంత్రులు తమకు కేటాయించిన శాఖలపై ఎలాంటి అసంతృప్తి లేదని తేల్చి చెప్పారు. దానం నాగేందర్, పొన్నాల లక్ష్మయ్య, కాసు వెంకటకృష్ణారెడ్డి తదితరులు తాము అసంతృప్తితో ఉన్నామనే వ్యాఖ్యలు నిరాధారమన్నారు. మా శాఖలపై మాకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. అయితే మంత్రివర్గం సమావేశంలో ముఖ్యమంత్రితోనే మాట్లాడి తేల్చుకుందాని వారు అనుకుంటున్నట్టు సమాచారం. మంత్రివర్గంలో అసంతృప్తులంటూ మీడియానే అనవసర రాద్దాంతం చేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మాకయితే అలాంటి వాతావరణమేది కనిపించటం లేదన్నారు.












Click it and Unblock the Notifications