వైయస్ జగన్ తో రాజకీయాలు మాట్లాడలేదు: వైయస్ వివేకానంద

కుటుంబ సంబంధాలను కాపాడుకోవడానికే తాను వైయస్ జగన్ ను కలిసినట్లు వైయస్ వివేకానంద రెడ్డి భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. రాజకీయంగా వేర్వేరుగా ఉన్నప్పటికీ కుటుంబ సంబంధాలను కొనసాగించే విషయంపై వైయస్ జగన్ తో చెప్పినట్లు ఆయన తెలిపారు. కాగా, వైయస్ జగన్ అభిమానులు వైయస్ వివేకానంద రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ వివేకానంద రెడ్డి రాజీనామా చేయాలని, వైయస్ జగన్ కు అండగా నిలవాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications