కెవిపిపై ఆరోపణలకు కొండా సురఖపై కాంగ్రెసు ముప్పేట దాడి

సురేఖపై కాంగ్రెసు శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు మల్లు భట్టి విక్రమార్క, మల్లాది విష్ణు, గండ్ర వెంకటరమణా రెడ్డి, దుర్గేష్, రౌతు సూర్యప్రకాశ రావు, పార్లమెంటు సభ్యుడు రాజయ్య తీవ్రంగా ధ్వజమెత్తారు. సీనియర్ పార్లమెంటు సభ్యుడు కెవిపిపై కొండా సురేఖ ఆరోపణలు చేయడం దారుణమని పార్లమెంటు సభ్యుడు రాజయ్య అన్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలు తిన్నింటి వాసాలు లెక్కపెట్టినట్లుగా ఉందని ఆయన అన్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలకు మూలాలు ఎక్కుడున్నాయో తేలాలని రౌతు సూర్యప్రకాశ రావు అన్నారు. కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని దుర్గేష్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications