విద్యార్థులపై కేసుల ఎత్తివేతకు మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కొలికి

హైదరాబాదులోని పాతబస్తీ ముస్లిం యువకులు కూడా తెలంగాణవారేనని, తెలంగాణ విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తేసినప్పుడు తెలంగాణలో పెట్టిన కేసులన్నింటినీ ఎత్తేయాలని ఆయన అన్నారు. తనపై కూడా కేసు నడుస్తోందని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజలను సంతోషపెట్టడానికి ప్రభుత్వం కేసులు ఎత్తేస్తోందని ఆయన అన్నారు. ఈ కేసుల ఎత్తవేతపై ఎవరైనా కోర్టుకు వెళ్లి స్టే తెస్తే పరిస్థితి తీవ్రమవుతుందని, దానితో తెలంగాణలో మరింత అలజడి చెలరేగుతుందని ఆయన అన్నారు. డిసెంబర్ 31వ తేదీ తర్వాత ఏ విధమైన చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరగని రీతిలో కేసుల ఉపసంహరణ ఉండాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications