చిరంజీవి కోసమే ఉప ముఖ్యమంత్రి పదవి ఖాళీ?

Chiranjeevi
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి కోసమే ఉప ముఖ్యమంత్రి పదవిని ఖాళీగా ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది. తాము ప్రభుత్వంలో చేరే సమయం వస్తోందని ప్రజారాజ్యం పార్టీ నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాము పదవుల కోసం ఆర్రులు చాస్తున్నామనే అభిప్రాయం ప్రజలకు కలగకుండా ఉండేందుకే ఇంత వరకు ప్రభుత్వానికి దూరంగా ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వస్తే తమను తాము సమర్థించుకుంటూ ప్రభుత్వాన్ని కాపాడాల్సిన అవసరంపై ప్రజలకు వివరణ ఇచ్చుకోవడానికి వీలవుతుందని చిరంజీవి భావిస్తున్నట్లు చెబుతున్నారు. వైయస్ జగన్ కాంగ్రెసు అసంతృప్తు శాసనసభ్యులను తన వైపు తిప్పుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఊపందకున్నట్లు చెబుతున్నారు.

కృష్ణా జిల్లాకు చెందిన శాసనసభ్యుడు పేర్ని నాని వైయస్ జగన్ వైపు వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. ఒక్కరొక్కరే అసంతృప్త శాసనసభ్యులు వైయస్ జగన్ వైపు వెళ్తారని అనుకుంటున్నారు. కుతూహలమ్మ వంటి సీనియర్ శాసనసభ్యులు కూడా జగన్ వైపు వెళ్లే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. శాసనసభ్యులు వైయస్ జగన్ వైపు వెళ్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ప్రమాదంలో పడినప్పుడు ఆదుకోవాలని చిరంజీవి భావిస్తున్నారు. ఆ సమయం కోసమే ఆయన వేచి చూస్తున్నట్లు చెబుతున్నారు. చిరంజీవి మనోగతాన్ని గమనించే కాంగ్రెసు అధిష్టానం ఉప ముఖ్యమంత్రి పదవిని ఖాళీగా ఉంచినట్లు చెబుతున్నారు.

ప్రభుత్వంలో చేరితే చిరంజీవికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనేది ఓ నిబంధనగా ఉన్నట్లు చెబుతున్నారు. ఆ సమయంలోనే తెలంగాణ నాయకుడికి పిసిసి అధ్యక్ష పదవి కట్టబెడతారని అంటున్నారు. రాయలసీమకు ముఖ్యమంత్రి పదవి, రాయలసీమకు చిరంజీవి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కోస్తాంధ్రకు ఉప ముఖ్యమంత్రి పదవి, తెలంగాణకు పిసిసి పదవి ఇచ్చినట్లు అవుతుందని కాంగ్రెసు ఉద్దేశంగా చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+