చంద్రబాబుకు హారతి ఇచ్చి నిరాహార దీక్షకు పంపిన భువనేశ్వరి

అనంతరం ట్యాంక్ బండుపైన ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి, అక్కడినుండి ఎన్టీఆర్ గార్డెన్ కు చేరుకొని ఎన్టీఅర్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. అక్కడినుండి ఆమరణ నిరాహర దీక్ష కోసం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్సుకు కారులో వెళ్లారు. చంద్రబాబు ఎన్టీఆర్ ఘాట్ నుండి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్సు వరకు పాదయాత్రగా వెళదామనుకున్నారు. అందుకు చంద్రబాబును భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆయన కారులో బయలు దేరారు.
బాబుకు మద్దతుగా పలువురు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, నాయకులు, కార్యకర్తలు ఆయన వెంట వచ్చారు. చంద్రబాబుకు మద్దతుగా ఆయన బావమరిది నందమూరి హరికృష్ణ కూడా ఎన్టీఆర్ ఘాట్ నుండి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్సుకు పాదయాత్ర నిర్వహించారు.












Click it and Unblock the Notifications