వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీ ముందు పెనుసవాళ్లు: ప్లీనరీలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ చరిత్ర చాలా గొప్పదని, కాంగ్రెస్ ఎప్పుడు పేదల కోసమే ఉన్నదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదివారం అన్నారు. మూడురోజుల ప్లీనరీ సమావేశంలో భాగంగా రెండో రోజు ఆమె సమావేశాలను ప్రారంభించి ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ ప్రజల మద్దతు ఉంటుందన్నారు. జై జవాన్ జై కిసాన్ అన్న మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి నినాదాన్ని కొనసాగిస్తున్నామన్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు చేపట్టిన ఆర్థిక సంస్కరణలు భారతదేశ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడినాయని చెప్పారు. దేశంలోనే అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ అన్నారు.

నవ్యత, సేవ ఈ రెండు కాంగ్రెస్ ఎజెండా అని ప్రకటించారు. కేంద్రంలో, కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదంటే ఆ ఘనత ఎవరి వ్యక్తిగతం కాదని, అది పార్టీ ఘనతే అన్నారు. జమ్ము-కాశ్మీర్ లో శాంతి భద్రతలకై కృషి చేస్తామని చెప్పారు. నక్సల్స్ సమస్యను అరికట్టడానికి సంపూర్ణంగా కృషి చేస్తామని చెప్పారు. దేశంలోని ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూస్తున్నారని చెప్పారు.

కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితుల్లో అనేక సవాళ్లను ఎదుర్కొంటుందన్నారు. ప్రతినేత ప్రస్తుతం ఆత్మపరిశీనల చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. జాతీయంగా పార్టీని ప్రక్షాళన చేయాలని బీహార్ ఎన్నికలు రుజువు చేశాయన్నారు. పార్టీ అధఇకారంలో లేని రాష్ట్రాల్లో కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. కాగా ఈ ప్లీనరీలో కాంగ్రెస్ అధ్యక్ష పదవిని మూడు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాలకు పొడిగిస్తూ పార్టీ నిబంధనను పొడిగించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X