దీక్ష విరమించాలంటే చంద్రబాబు వినడం లేదు: భువనేశ్వరి

సినీ నటుడు తారకరత్న కూడా చంద్రబాబును బుధవారం పరామర్శించారు. తన మామ చంద్రబాబు దీక్ష విరమించడానికి నిరాకరిస్తున్నట్లు ఆయన కూడా తెలిపారు. తనకు రైతుల ప్రయోజనాలు ముఖ్యమని, ప్రాణత్యాగానికైనా సిద్ధపడుతానని చంద్రబాబు అంటున్నట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యం పట్ల తెలుగుదేశం నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. దీక్ష విరమణకు చంద్రబాబు అంగీకరించడం లేదని ఆయన చెప్పారు. బుధవారం సాయంత్రం తామంతా సమావేశమై భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయించుకుంటామని ఆయన చెప్పారు.
కాగా, చంద్రబాబును ఐసియుకి మారుస్తామని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి చెప్పారు. చంద్రబాబు దీక్ష విరమిస్తే రైతు సమస్యలపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకు చికిత్స అందిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications