రాజీనామాల యోచనకు కొర్రీ: తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలు వెనక్కి

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా బాట పట్టని శాసనసభ్యలు చంద్రబాబు కోసం రాజీనామా చేసారనే అపవాదు వస్తుందనే వారు రాజీనామాకు వెనక్కి పోతున్నారనే పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గత ఏడాదిగా తెలంగాణ కోసం తీవ్ర ఉద్యమాలు జరుగుతుంటే వారు సమైక్యవాదం వైపు మొగ్గు చూపుతున్న చంద్రబాబు వెంటే ఉండటాన్ని ఇప్పటికే తెలంగాణవాదులు జీర్ణించుకోలేక పోతున్నారు. అంతేకాకుండా తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ రాజీనామా చేశారు. ఇక ప్రజారాజ్యం, లోక్ సత్తా పార్టీల వారు ఆయా పార్టీల అధ్యక్షులకు వ్యతిరేకంగా తెలంగాణకు మద్దతు పలికారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఆ శాసనసభ్యులపై పెద్దగా ప్రభావం ఉండదు. మిగిలిన తెలుగుదేశం పార్టీ సభ్యులు తెరాస, భాజపా దారిలో రాజీనామాలు చేయకుండా, అటు లోక్ సత్తా, ప్రరాపా దారిలో అధినేతకు వ్యతిరేకత ప్రదర్శించకుండా మిన్నకుండిపోయారు. అప్పుడు రాజీనామా చేయనివారు ఇప్పుడు రాజీనామా చేస్తే తెలంగాణ ప్రజలు వారిని విమర్శించే అవకాశం ఇచ్చినట్టవుతుందని వారు భావిస్తున్నట్టు సమాచారం. రాజీనామా చేస్తే మళ్లీ గెలవడం కష్టమనే ఆలోచనలో కూడా తెలంగాణ తెలుగుదేశం నేతలు ఉన్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications