చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళనగా ఉంది: జూనియర్ ఎన్టీఆర్

చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కొరకుగానీ, వారి కార్యకర్తలకుగానీ న్యాయం చేయమని ప్రభుత్వం ముందు డిమాండ్లు పెట్టి దీక్ష చేయడం లేదని జూనియర్ ఎన్టీఆర్ విలేకరులతో చెప్పారు. ప్రభుత్వం రైతుల సమస్యల పరిష్కారం కోసం, బాబు దీక్షపై వెంటనే స్పందించాలన్నారు. దీక్ష విరమించమని తాము కోరినప్పటికీ రైతుల సమస్య పరిష్కారమయ్యే వరకు దీక్ష విరమించేది లేదని ఆయన కరాఖండిగా చెబుతున్నారని అన్నారు.
చంద్రబాబు దీక్షపై ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు. ఇతర దేశాలలో రైతులకు ప్రాధాన్యత ఉంటుందని మరో హీరో కళ్యాణ్ రాం అన్నారు. అక్కడి రైతులు కార్లలో తిరుగుతారని కానీ ఇక్కడి రైతులకు తమ సమస్యలే పరిష్కారం కావటం లేదన్నారు. తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రిపై ప్రభుత్వం ఇలా వ్యవహరించటం సరికాదని అన్నారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి బాబు దీక్షను విరమించేలే ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాలని చెప్పారు.












Click it and Unblock the Notifications