సిఎం మార్పు అవాస్తవం, రేసులో ఎప్పుడూ ఉంటా: జానారెడ్డి

హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మార్పుపై వస్తున్న వార్తలను మంత్రి జానారెడ్డి గురువారం ఖండించారు. ముఖ్యమంత్రి పదవినుండి కిరణ్‌ను తప్పించి తెలంగాణ వారికి ఇస్తారని వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజాలు లేవని చెప్పారు. ఇలాంటి వార్తలు ఇచ్చేటప్పుడు నిజానిజాలు తెలుసుకుంటే మంచిదని మీడియాకు సూచించారు. ఇలాంటి అసత్య వార్తలు ఇవ్వడం సబబు కాదని, ప్రజలను తప్పుదోవ పట్టించడానికే ఇలాంటి వార్తలు ఇస్తున్నారన్నారు. మీడియా వార్తల విషయంలో సంయమనం పాటించాలని వాస్తవాలనే ప్రజలకు చెప్పాలన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వెంటవెంటనే ముఖ్యమంత్రులను మార్చదని చెప్పారు. ఊహాజనిత వార్తలు మాత్రం వద్దన్నారు. ముఖ్యమంత్రి రేసులో తనను కూడా పేర్కొన్నారన్నారు. ముఖ్యమంత్రి రేసులో తన పేరు ఎప్పుడూ మీడియా ఉంచుతుందన్నారు. తెలంగాణ ఇవ్వకుండా ముఖ్యమంత్రి, మంత్రి పదవులతో ఎవరూ సంతృప్తి పడరని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి మార్పు ఉంటుందనే ప్రచారం ఎవరిదో సులభంగానే అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+