వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రస్తుత పరిస్దితులలో కాంగ్రెసు ప్రక్షాళన జరిపితే మంచిది: ఎంపీ సబ్బం హరి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Sabbam Hari
న్యూఢిల్లీ: అటు తెలంగాణవారి, ఇటు సీమాంధ్రవారి మనోభావాలు దెబ్బతినకుండా అందరినీ సమైక్యంగా ఉంచాలని శ్రీకృష్ణ కమిటీ నివేదికలో పేర్కొందని, ఇరుప్రాంతాల ప్రజాప్రతినిధులను కలిపితీసుకెళ్లే బాధ్యత పార్టీ అధిష్టానంపై ఉందని కాంగ్రెసు ఎంపీ సబ్బం హరి చెప్పారు. ఎంపీ కావూరి నివాసంలో గురువారం జరిగిన సీమాంధ్ర కాంగ్రెసు ఎంపీల భేటీకి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటివరకు తాను ఏనాడూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు.

కానీ ప్రస్తుతం రాష్ట్రంలో భిన్న రాజకీయ వాతావరణం నెలకొందని, ఒక కాంగ్రెసు కార్యకర్తగా బాధపడే పరిస్థితులున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలతో పూర్తిగా మారిందన్నారు. ఎవరిది తప్పో తాను ప్రకటించనని, ఆ విషయం మాట్లాడితే తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడానని అంటారని చెప్పారు. ఏదైనా రాష్ట్రం సంక్షోభం దిశగా వెళ్లడానికి కాంగ్రెసు కొంత కారణమైందని అంగీకరించారు. ఈ పరిస్థితులను సరిచేసి, ప్రక్షాళన జరిపి మంచి వాతావరణాన్ని పార్టీ తీసుకురాగలిగితే కాంగ్రెసు‌లో ఉండటానికి ఇష్టపడతానన్నారు. రాష్ట్ర ఎంపీలకు కేబినెట్‌లో సముచిత గౌరవం కల్పించడం అవసరమన్నారు.

ఇక పోతే రాష్ట్ర కేబినెట్‌లోకి పీఆర్పీని తీసుకుంటే తీవ్ర పరిణామాలుంటాయనేదే ఇప్పటికీ తన అభిప్రాయమని సబ్బం తెలి పారు. 155 మంది కాంగ్రెసు ఎమ్మెల్యేలు ఉన్నందున వారికే మంత్రివర్గంలో స్థానం కల్పించాలని, పీఆర్‌పీవారిని తీసుకోరాదని అభిప్రాయపడ్డారు. 2014వరకు ప్రభుత్వాన్ని అస్థిరపరిచేది లేదని అనేక సందర్భాల్లో యువనేత జగన్ చెబుతున్నారని, ఈ పరిస్థితుల్లో కాంగ్రెసు‌వారిని ఉపయోగించుకుని పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X