జై బోలో తెలంగాణకు సర్టిఫికెట్ ఇవ్వకుంటే సినిమాల విడుదలను అడ్డుకుంటాం

జై బోలో తెలంగాణ సినిమాకు సాయంత్రంలోగా సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోతే తామే రేపటి నుంచి సినిమాల విడుదలను అడ్డుకుంటామని, తమపై విశ్వాసం ఉంచి ప్రస్తుతం నడుస్తున్న సినిమాలను తెలంగాణవాదులు ఆడనివ్వాలని ఆయన అన్నారు. జై బోలో తెలంగాణకు సెన్సార్ బోర్డు అభ్యంతరాలు చెప్పడంపై తీవ్రంగా ఆగ్రహించిన తెలంగాణవాదులు మంగళవారం రాత్రి నుంచి తెలంగాణ ప్రాంతంలో సినిమాల ప్రదర్శనను అడ్డుకుంటున్నారు. బుధవారం విడుదలైన గోపీచంద్ వాంటెడ్ సినిమా ప్రదర్శనకు తీవ్ర ఆటంకాలు ఎదురయ్యాయి.












Click it and Unblock the Notifications