వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సీమాంధ్ర ప్రజలకు జై బోలో తెలంగాణ సినిమా ప్రేరణ ఇస్తుంది: కెసిఆర్

జై బోలో తెలంగాణ సినిమా అద్భుతంగా ఉందని ఆయన ప్రశంసించారు. ప్రతి తెలంగాణ వ్యక్తి ఈ సినిమా చూడాలని ఆయన సూచించారు. మూడు తరాల తెలంగాణ పోరాటాన్ని అద్బుతంగా చిత్రీకరించిన సినిమా దర్శకుడు శంకర్‌ను నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరఫున అభినందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ చిత్రాన్ని ఇతర భాషల్లోకి తీసుకుని వెళ్తామని ఆయన చెప్పారు. జై బోలో తెలంగాణ సినిమా తెలంగాణ ఉద్యమానికి ఉపయోగపడుతందని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ అభిప్రాయపడ్డారు. జెఎసి నాయకులతో కలిసి ఆయన సినిమా చూశారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్ ప్రసాద్ ఐమాక్స్‌లో సినిమా తీశారు.
Comments
కె చంద్రశేఖర రావు తెలంగాణ జై బోలో తెలంగాణ కోదండరామ్ k chandrasekhar rao telangana jai bolo telangana kodandaram
Story first published: Friday, February 4, 2011, 14:57 [IST]