వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త్వరలో కేంద్రం తెలంగాణ ప్రకటిస్తుంది: వి హనుమంతరావు

By Srinivas
|
Google Oneindia TeluguNews

V Hanumantha Rao
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సాధ్యమైనంత తొందరగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు బుధవారం ఓ టీవీ ముఖాముఖిలో చెప్పారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఏకాభిప్రాయం కావాలని చెప్పనంత మాత్రానం తెలంగాణ అంశం పక్కన పెట్టినట్టు కాదని చెప్పారు. డిసెంబర్ 9వంటి హామీ గతంలో ఎప్పుడూ రాలేదని, అయితే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇప్పుడు ఆ హామీ ఇచ్చారని, అయితే పరిస్థితులను బట్టి త్వరలో ప్రకటిస్తారని చెప్పారు. తెలంగాణ ప్రజలు కూడా కాంగ్రెస్‌పై నమ్మకంతో ఉన్నారని చెప్పారు. సీమాంధ్రలో కూడా తెలంగాణపై అభిప్రాయం క్రమంగా మారుతోందన్నారు.

భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు గతంలో సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారని, ఇప్పుడు తెలంగాణకు అనుకూలంగా మారారని గుర్తు చేశారు. సిపిఐ నేత నారాయణలో కూడా మార్పు వస్తుందన్నారు. కానీ తెలంగాణలో మాత్రం ఉద్యమం రోజురోజుకు ఉధృతమవుతుందన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే తీవ్రంగా స్పందిస్తున్నారన్నారు. హోంమంత్రి చిదంబరం రెండో సమావేశం ఇవ్వాలో రేపో ఉంటుందన్నారు. ఒక్కో పార్టీనుండి ఒక్కరు అని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయని, ఆ విషయంలో కేంద్రం యోచిస్తుందని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఉంటే కేంద్రంలో బలం మరింతగా ఉంటుందన్నారు. అభివృద్ధి కూడా బావుంటుందన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి లక్ష్యం కేవలం ప్రత్యేక తెలంగాణ లక్ష్య సాధన కోసమే పుట్టింది కాబట్టి వారు ఏమైనా చేయవచ్చని, అయితే కాంగ్రెస్ జాతీయ పార్టీ అని తెలంగాణలో పార్టీని నిలుపుకుంటూ ప్రజల అభీష్టం మేరకు వెళ్లవలసి ఉంటుందన్నారు. ఆయన అవిశ్వాసమే కాదు, ఆయన ఎజెండా కోసం ఏమైనా చేయవచ్చన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి ఆషామాషీగా రాలేదన్నారు. కిందిస్థాయినుండి ఒత్తిడులు వచ్చినందువల్లే వారు తెలంగాణపై డిమాండ్ చేస్తూ ఢిల్లీ వచ్చారన్నారు.

English summary
Congress Senior leader, Rajya Sabha Member V Hanumantha Rao said today, The Central Government will announce Telangana soon. TRS agenda is only Telangana, so they are demanding for No-Confidence Motion, But Congress is National party, So we are giving importance to Telangana as well as Party survival in Telangana, he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X