జగన్‌కు వస్తున్న స్పందన చూశారుగా: ఎమ్మెల్యే కొండా సురేఖ
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఫీజు పోరు దీక్షకు ప్రజల స్పందన ఎలా ఉందో అందరూ చూస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ఫీజు రీయింబర్స్‌మెంట్స్ చెల్లించాలని జగన్ వర్గం శాసనసభ్యురాలు కొండా సురేఖ అన్నారు. జగన్ దీక్ష చేస్తున్నందుకు కాకపోయినా సుప్రీంకోర్టు తీర్పు మేరకు అయినా స్పందించాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌పై ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. కళాశాల యాజమాన్యాలు కళాశాలలు మూసివేస్తామని హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం దిగిరావడం లేదన్నారు. ప్రభుత్వం వైఖరి కారణంగా 25 లక్షలమంది విద్యార్థుల జీవితాలు అంధకారమయ్యే అవకాశం ఉందన్నారు. వారి కుటుంబాలు రోడ్లపైన పడే పరిస్థితి వచ్చిందన్నారు.
ప్రభుత్వం నిధులు లేవనే సాకుతో ఫీజు రీయింబర్స్‌మెంట్స్ నుండి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తుందన్నారు. ఇప్పటికే వరలక్ష్మి ఆత్మహత్య చేసుకుందని గుర్తు చేశారు. ఇంత పెద్ద మొత్తంలో సెక్యూరిటీని పెట్టి శాసనసభను నడిపించిన సందర్భాలు ఇప్పటి వరకు లేవన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పోయిందన్నారు. ఫీజులు చెల్లిస్తారా లేదా చెప్పండి. చెల్లించమని చెబితే విద్యార్థులు వారి పాట్లు వారు పడతారన్నారు.
Ex Minister Konda Surekha blamed CM Kiran Kumar Reddy government today at media point. She demanded government to release fee reimbursement soon. She said all students are supporting Jagan Fee Poru.
Story first published: Monday, February 21, 2011, 13:36 [IST]