హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసెంబ్లీలో కాంగ్రెసు, టిఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్: పయ్యావుల కేశవ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Payyavula Keshav
హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగకుండా తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెసు పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాయని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ మంగళవారం ఆరోపించారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ప్రజా సమస్యలపై పోరాడుతున్నారని, ఆయన పోరాటాలు కనుమరుగు చేయడానికి వారు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణకు మరోసారి మోసం చేస్తుందేమోననే అనుమానం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి మాటల ద్వారా అర్థం అవుతుందని సిపిఐ శాసనసభ్యుడు గూండా మల్లేష్ మంగళవారం మీడియా పాయింట్ వద్ద ఆరోపించారు. రచ్చబండ కార్యక్రమంలో తెలంగాణ ప్రజలు అభివృద్ధితో పాటు తెలంగాణను కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సభలో చెబితే బావుండేది, కానీ రచ్చబండ ఏకపక్షంగా విజయవంతమైందనడాన్ని ఆయన తప్పుపట్టారు.

తెలుగుదేశం పార్టీకి చెందిన సీమాంధ్ర ఎమ్మెల్యేలు తెలంగాణ తీర్మానం ప్రవేశ పెడితే ఆయా పార్టీల ఎమ్మెల్యేల ఎటు మద్దతు ఇస్తారో బయట పడుతుందన్నారు. తెలంగాణకు చెందిన అన్ని పార్టీల శాసనసభ్యులు తెలంగాణకు అనుకూలంగా ఉన్నారన్నారు. సమావేశాలు సజావుగా సాగటం లేదని సిపిఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. సమావేశాలు మొక్కుబడిగా మాత్రమే సాగుతున్నాయన్నారు. సభ సజావుగా నడవక పోవడం వలన ప్రజాధనం వృథా చేస్తున్నారన్నారు. టిఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేస్తున్నట్టు తెలంగాణ సమస్యపై తీర్మానం ప్రవేశ పెడుతారా లేదా అని ప్రభుత్వం తేల్చుకోవాలన్నారు. తీర్మానం పెడితే పెడతానని చెప్పాలన్నారు. లేదంటే సభను అడ్డుకునే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.

English summary
TDP senior MLA payyavula Keshav alleges that the TRS and Congress are made match fixing to disrupt in assembly. CPI MLA Gunda Mallesh accused CM Kiran Kumar Reddy comments on Rachabanda. CPM MLA Julakanti Rangareddy also expressed dissatisfaction on assembly session.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X