తెలంగాణపై చంద్రబాబు కొత్త డ్రామా: టిఆర్ఎస్ నేత జగదీశ్వర్

తెలంగాణ టిడిపి నేతలు ఇప్పటికైనా పార్టీని వదిలి బయటకు వచ్చి తెలంగాణ కోసం ఉద్యమించాలని చెప్పారు. తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా 48 గంటల బంద్‌ను విజయవంతం చేసినందుకు ఆయన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ సమస్యకు కాంగ్రెస్ పార్టీదే బాధ్యత అని, అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. అయితే టిడిపి కూడా ఒక పెద్ద సమస్యపై ప్రతిపక్షంగా ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం కూడా ఉందన్నారు. సీమాంధ్ర ఒక వర్గానికి చెందిన ఎంపీలే తెలంగాణను అడ్డుకుంటున్నారన్నారు. హైదరాబాద్‌లో ఉన్న వారి పెట్టుబడులు రక్షించుకోవడానికి వారు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. తెలంగాణ సమస్యపై పార్లమెంటులో టిఆర్ఎస్ ఇవ్వాళ బాగా పోరాడిందన్నారు.
శాంతియుతంగా, మహాత్మాగాంధీ మార్గంలో నడుస్తున్న ఉద్యమాన్ని పోలీసులు దుర్మార్గంగా అణిచివేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని టిఆర్ఎస్ నేత శ్రవణ్ కుమార్ ఆరోపించారు. విద్యార్థులను తీవ్రంగా బాధిస్తున్నారన్నారు. ఉద్యోగులు, విద్యార్థులు చేస్తున్న సహాయ నిరాకరణగు మద్దతుగా పోలీసులు కూడా గన్ డౌన్ చేయాలని ఆయన కోరారు.


Click it and Unblock the Notifications