ఎస్ బ్యాండ్ ఒప్పందంతో మాకు సంబంధం లేదు: ప్రధాని మన్మోహన్

ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత మెరుగుపరుస్తాం అన్నారు. ద్రవ్యోల్బణం తగ్గించడానికి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉల్లి, ఆయిల్ వంటి నిత్యావసర ధరలు బాగా పెరిగాయన్నారు. అంతర్జాతీయ విపణిలో ధరలు క్రమంగా పెరుగుతున్నయన్నారు. అందుకే వాటిపై మనకు నియంత్రణ లేకుండా ఉందన్నారు. గోదుమ, బియ్యం వంటి వాటి ధరలు నియంత్రించడానికి గోడౌన్‌లో భారీగా నిల్వలకు చర్యలు చేపట్టామని చెప్పారు. సిడబ్లూజీలో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. అవినీతికి పాల్పడిన వారిని కేంద్రం ఏమాత్రం ఉపేక్షించే ప్రశ్న లేదన్నారు.
గత కొన్నేళ్లలో టెలికాం రంగం గ్రామీణ ప్రాంతాల్లో 30 శాతం వృద్ధి చెందిందన్నారు. ఇప్పుడు పోన్ ఓ నిత్యావసరంలా తయారయిందన్నారు. పట్టణాల్లో కూడా బాగా పెరిగిందన్నారు. ఎన్డీయే ప్రభుత్వం హయాంలోనే లైసెన్సుల విధానంలో మార్పులు వచ్చాయన్నారు. 2జి లైసెన్సుల వేలం నిర్వహించాల్సి ఉండేదని, కానీ అలా జరగలేదన్నారు. ముందుగా వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత అన్న రీతిలో కొనసాగటం వల్లనే ఇలాంటి సమస్య వచ్చిందన్నారు. 2జి స్కాంపై జెపిసి వేశాం కాబట్టి అది విచారణ జరుపుతుందన్నారు. అయితే అవినీతికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దేశాభివృద్ధిలో ప్రజలకు భాగస్వామ్యం ఉండాలని అన్నారు. ఎస్ బ్యాండ్ - దేవాస్ ఒప్పందంలో పిఎంఓకు ఎలాంటి సంబంధం లేదన్నారు. దీనిపై ఉన్నతస్థాయి కమిటీ వేసినట్లు ఆయన తెలిపారు.