కాంగ్రెసును వీడండి, టిడిపి ఓ కన్ను పోగొట్టుకుంది: ఈటెల రాజేందర్

తెలంగాణ నాయకులు తమ తమ పార్టీలను వీడి తెలంగాణ జెఎసితో కలిసి పని చేయాలని ఆయన కోరారు. ఉద్యమాలు ఎలా ఉంటాయో తెలుగుదేశం పార్టీకి తమను విమర్శించే నైతిక హక్కు లేదని ఆయన అన్నారు. ఆ పార్టీకి కుర్చీలు, పదవులు కావాలని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీది రెండు కళ్ల సిద్ధాంతమని, ఓ కంటిని ఇప్పటికే పోగొట్టుకుందని ఆయన అన్నారు. మిలియన్ మార్చ్ టు హైదరాబాదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన తెలంగాణ ప్రజలను కోరారు.












Click it and Unblock the Notifications