నేను జగన్‌వైపే, మళ్లీ సినిమాల్లో నటిస్తున్నా: ఎమ్మెల్యే జయసుధ

Jayasudha
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డివైపే తాను ఉంటానని సికింద్రాబాద్ కాంగ్రెసు శాసనసభ్యురాలు, సినీతార జయసుధ గురువారం అసెంబ్లీ లాబీల్లో చెప్పారు. జగన్ పార్టీ పెట్టిన తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తానని అన్నారు. జగన్ పార్టీ పెట్టిన తర్వాత తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమా లేక కాంగ్రెసు పార్టీకి పూర్తిగా దూరంగా ఉండటమా అనేది తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. తన నిర్ణయం అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఉంటుందన్నారు. తెలంగాణ, సమైక్యాంధ్ర వంటి పలు ముఖ్య సమస్యలపై జగన్ తనను సంప్రదించడం లేదని ఆమె అన్నారు. అయితే తమకు రాజకీయ అనుభవం లేక పోవడం వల్లనే తమను సంప్రదించడం లేదు కావచ్చు అని ఆమె అభిప్రాయపడ్డారు.

కొత్తగా పలువురు ఎమ్మెల్యేలం ఈసారి ఎన్నికయ్యామని, అయితే ఇలాంటి గందరగోళాన్ని కొత్తగా ఎన్నికైన తాము భరించలేక పోతున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పైగా నాకు రాజకీయాలు అసలే తెలియవన్నారు. కాగా తాను మళ్లీ సినిమాల్లో నటిస్తున్నట్లు ఆమె చెప్పారు. త్వరలో తన పాటల ఆల్బమ్ విడుదల కాబోతున్నట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+