అరెస్టుకు ప్రయత్నిస్తే హుసేన్ సాగర్‌లో దూకుతా: ఎమ్మెల్యే హరీష్ రావు
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: పోలీసులు తనను అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తే హుస్సేన్ సాగర్‌లో దూకుతానని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు టి.హరీష్‌రావు గురువారం పోలీసులను హెచ్చరించారు. మిలియన్ మార్చ్‌లో పాల్గొనడానికి ఆయన టాంక్‌బండ్‌కు వచ్చారు. అయితే పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఆయన పోలీసుల కన్నుగప్పి తప్పించుకున్నారు. అక్కడినుండి బోట్ ద్వారా బుద్ద విగ్రహానికి చేరుకున్నారు.
బుద్ధ విగ్రహం వద్ద వున్న హరీష్‌ను పోలీసులు ఆరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. దాంతో పోలీసులను ఆయన హెచ్చరించారు. కాగా ట్యాంక్ బండ్ వద్ద నిర్వహిస్తున్న మిలియన్ మార్చ్ దగ్గర ఓ అపశృతి చోటుచేసుకుంది. మార్చ్‌లో పాల్గొన్న ఉస్మానియా విద్యార్థి సంపత్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. సంపత్‌ను చికిత్స కోసం దగ్గరలోని హస్పిటల్ తరలించారు.