హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు: అసెంబ్లీలో బాబు వర్సెస్ కిరణ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu - Kiran kumar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మధ్య మంగళవారం అసెంబ్లీ సమావేశాలలో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ దయవల్లే, కాంగ్రెస్ పార్టీ దయవల్ల ముఖ్యమంత్రి కిరణ్‌ ఆ పదవిలో కూర్చున్నారన్నారు. 1996 నుండి 2004 వరకు కాంగ్రెస్ విజయాన్ని సాధించలేదన్నారు. ఓ సమయంలో ప్రతి పక్ష హోదా కూడా రాలేదన్నారు. ముఖ్యమంత్రి తన వ్యక్తి గత ప్రతిష్టతో ముఖ్యమంత్రిగా కూర్చోలేదన్నారు.

అందుకు ముఖ్యమంత్రి కిరణ్ కూడా ధీటుగా సమాధానం ఇచ్చారు. వాస్తవంగా తాను సోనయాగాంధీ, కాంగ్రెస్ దయవల్లే ముఖ్యమంత్రిని అయ్యానన్నారు. విశ్వాసంతో ఉండి పార్టీని నమ్ముకున్నాను కాబట్టే తనను ఈ పదవి వరించిందన్నారు. పార్టీ బలమే నా బలమన్నారు. కానీ చంద్రబాబులా పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడవలేదన్నారు.రాజకీయ బిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీని, పిల్లనిచ్చిన మామను నేను మోసం చేసి ముఖ్యమంత్రిగా కూర్చోలేదని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. అలాంటి బాబు వద్ద తనకు నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు.

English summary
CM Kirankumar Reddy and TDP president Chandrababu make allegations one on another today in assembly. Chandrababu said Kiran sat on CM Chair by Sonia. CM Kiran said he was not attack who were gave life in politics to him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X