ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్9 విడుదల చేసిన 24గంటల్లో 2.3 మిలియన్ డౌన్‌లోడ్స్

ఈ సందర్బంలో మైక్రో సాఫ్ట బ్లాగులో దాని యాజమాన్యం ఈక్రింది విధంగా స్పందించారు. గతంలో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 9కి సంబంధించిన బీటా వర్సన్‌ని ఒక్కరోజులో దాదాపు 2మిలియన్ యాజుర్స్ డౌన్ లోడ్ చేసుకోవడం జరిగింది. కానీ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 9కి సంబంధించినటువంటి ఆఫీసియల్ బిల్డ్‌ని ఒక్కరోజులో 2.3 మిలియన్స్ యూజర్స్ డౌన్ లోడ్ చేసుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇక ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 9 విషయానికి వస్తే ఇది HTML5 మరియు CSS3ని సపోర్టు చేస్తుందని అన్నారు.
ఇది ఇలా ఉంటే మార్కెట్‌లోకి మార్చి 22వ తారీఖున మొజిల్లా ఫైర్ ఫాక్స్ 4ని విడుదల చేయడానికి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇది మాత్రమే కాకుండా గూగుల్ కూడా తన లేటేస్ట్ క్రోమ్ 10ని మార్కెట్ లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications