డిఎల్ రాజీనామా చేయాలి, జగన్‌పై వేధింపులుంటే ఇలాగే: జగన్ వర్గం

జగన్‌పై వేధింపులు మానుకోవాలని సూచించారు. కాంగ్రెసు పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రులు రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెసు పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడినా జగన్‌ను ఏమి చేయలేక పోయాయని అన్నారు.
కాగా కాంగ్రెసు ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కడప జిల్లా మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి రాజీనామా చేయాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. సొంత జిల్లాలో అభ్యర్థిని గెలిపించుకోలేని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఆ పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. కాంగ్రెసు అభ్యర్థులు ఓడిన చోట ఉన్న ఇంఛార్జులుగా ఉన్న మంత్రులు, జిల్లా మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.