ప్రపంచ రికార్డ్ డౌన్ లోడ్స్ నమోదు చేసిన మొజిల్లా ఫైర్‌ఫాక్స్ 4

అసలు నిజంగానే 5మిలియన్ డౌన్ లోడ్స్ జరిగాయా అనే నమ్మకం లేనివారికి మొజిల్లా ప్రత్యేకంగా తన సైట్ లో డౌన్ లోడ్ ట్రాకర్‌ని పోందుపరచడం జరిగింది. అంతేకాకుండా ఫైర్‌ఫాక్స్4 గురించిన సమాచారం అంతా అందులో పోందుపరచడమే కాకుండా ఫైర్‌ఫాక్స్4 ఎలా ఫెర్పామెన్స్ చేస్తుందనేది కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా యూరప్, నార్త్ అమెరికా దేశాలలో ఎక్కువగా మొజిల్లా ఫైర్‌ఫాక్స్ డౌన్ లోడ్స్ జరిగాయని మొజిల్లా డౌన్ లోడ్ సెంటర్ వారు ధృవీకరించారు.
ఇక ఫైర్‌ఫాక్స్4 ని దాదాపు 80 లాంగ్వేజస్‌లలో విడుదల చేయడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా నాగిగేషన్ టాబ్ యూజర్స్‌కు అనుకూలంగా రూపోందించబడింది. ఆన్ లైన్‌లో డేటా సురక్షితంగా ఉండడం కోసం Do Not Track and Content Security Policy లాంటి ఫీచర్స్ ని పోందుపరచడం జరిగింది. గతంలో మాదిరి ఉన్నట్లు ఫైర్‌ఫాక్స్4కి పవర్ పుల్ యాడ్ ఆన్స్, ఎక్స్ ట్రాగా Web technologies మరియు HTML5 సపోర్టు చేసే విధంగా రూపోందిచడం జరిగింది.












Click it and Unblock the Notifications