వైయస్ జగన్‌పై వరదరాజులు రెడ్డి, విజయమ్మపై వైయస్ వివేకానంద రెడ్డే

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌లు కడప జిల్లా నేతలతో మంగలవార రాత్రి సుదీర్ఘంగా మంతనాలు సాగించారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు, ఇన్‌ఛార్జి మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, ఇతర నేతలతో సీఎం, డీఎస్‌లు మూడుగంటలపాటు సమాలోచనలు జరిపారు. డీఎల్ రవీంద్రారెడ్డి, వరదరాజులరెడ్డి, తులసిరెడ్డి, నర్రెడ్డి రాజశేఖరరెడ్డిల పేర్లపై చర్చ జరిగింది. చివరికి వరద పేరుపైనే ఏకాభిప్రాయం వ్యక్తమయింది. ఈ సమావేశంలో ఆయన లేకపోవడంతో బుధవారం ఆయనతో పాటు నేతలంతా మరోమారు భేటీ అయ్యాక తుది నిర్ణయం తీసుకోవాలని భావించారు. అనూహ్య పరిస్థితుల్లో కందుల రాజమోహనరెడ్డి కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి అయినా ఆశ్చర్యంలేదని అంటున్నారు. విజయం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక మంత్రిని ఇన్‌ఛార్జిగా నియమించాలని నిర్ణయించారు.
కడప లోక్‌సభకు, పులివెందుల అసెంబ్లీ స్థానానికి బలమైన అభ్యర్థులను పోటీకి దింపాలనేది కాంగ్రెసు అధిష్ఠానం స్థిర నిర్ణయం. వివేకా ఇప్పటికే పులివెందుల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. కడప లోక్‌సభ స్థానంలోనూ గట్టి పోటీ ఇవ్వడం ద్వారా సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ లోక్‌సభ పరిధిలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు కడప, మైదుకూరు, పులివెందులకు ముగ్గురు మంత్రులు అహ్మదుల్లా, డీఎల్, వివేకాలు ప్రాతినిధ్యం వహిస్తుండడం కాంగ్రెస్‌కు కలిసివస్తోంది. కమలాపురంలో ఎమ్మెల్యే వీరశివారెడ్డి, బద్వేల్‌లో మాజీ ఎమ్మెల్యే శివరామకృష్ణయ్య, పొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డిలు బాధ్యతలు తీసుకుంటున్నారు. జమ్మలమడుగులోనే కాంగ్రెస్ గడ్డు సమస్యనెదుర్కొంటోంది. దీనిపై మంత్రి డీఎల్ ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు.