జూ.ఎన్టీఆర్‌తో కలిసి చంద్రబాబు ఇంటికి హరికృష్ణ: పెళ్లికి ఆహ్వానం

మే 5వ తారీఖున లక్ష్మీ ప్రణతితో ఎన్టీఆర్ పెళ్లికి రావాలని హరికృష్ణ ఆయనను ఆహ్వానించారు. అయితే గత కొద్దిరోజులుగా ఇరు కుటుంబాల మధ్య ఉన్న గొడవలు ఈ సమయంలో చర్చకు రాలేదని తెలుస్తోంది. అందరి ఇళ్లకు వెళ్లి పత్రికలు పంచుతున్నట్లుగానే చంద్రబాబు ఇంటికి వెళ్లి పంచినట్లుగా సమాచారం. దీంతో ఎలాంటి రాజకీయ చర్చలకు అవకాశం లేదని తెలుస్తోంది. కేంద్రమంత్రి పురందేశ్వరి నందమూరి కుటుంబాన్ని నారా కుటుంబం నుండి దూరం చేయాలని హరికృష్ణను పావుగా వాడుకుంటుందన్న వివాదం బహిర్గతమయిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications