• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వైయస్ జగన్‌పై కెసిఆర్‌కు ప్రేమ ఎందుకో!: జెఏసిలో అనుమానం

By Srinivas
|
Google Oneindia TeluguNews
K Chandrasekhar Rao
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టాక తెలంగాణపై ఆయన వైఖరిని ప్రశ్నిస్తామని చెప్పిన తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు చడీ చప్పుడు లేకుండా ఉండటంపై తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. రెండు కళ్ల సిద్ధాంతం అన్న టిడిపిని, తెలంగాణ ఇచ్చేది తెచ్చేది మేమే అన్న కాంగ్రెసును మాత్రమే టార్గెట్ చేసుకొని జగన్ పార్టీ పెట్టి ఇన్ని రోజులు కావస్తున్నా మాట్లాడక పోవడంపై జెఏసిలో అనుమానాలు రేకెత్తిస్తున్నట్టుగా తెలుస్తోంది. లోకసభలో సమైక్యాంధ్ర ప్లకార్డు పట్టుకున్న జగన్ మానుకోట పర్యటన అడ్డుకోవటంలో సహకరించిన టిఆర్ఎస్ ఆ తర్వాత హైదరాబాదులో జరిగిన ఫీజు పోరుపై ఎందుకు స్పందించలేదో జెఏసికి అంతుపట్టకుండా ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో కెసిఆర్‌పై, టీఆర్ఎస్‌పై వారికి అనుమానం వ్యక్తమవుతున్నట్లుగా తెలుస్తోంది. జగన్ పార్టీ పెట్టాక కూడా తెలంగాణపై ఆయన స్టాండ్ ప్రశ్నించక పోవడాన్ని తప్పు పడుతున్నారు.

అవినీతిపై అన్నాహజారే ఉద్యమానికి మద్దతు ఇచ్చిన టీఆర్ఎస్, తండ్రి ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డు పెట్టుకొని వేల కోట్లు దండుకున్న విషయంపై ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్న తలెత్తుతుంది. అయితే జగన్ మానుకోట పర్యటనను మొదట అడ్డుకునేందుకు చొరవ తీసుకున్నది జెఏసియే. సమైక్యవాది అయిన జగన్ పర్యటన అడ్డుకుంటామని జెఏసి ప్రకటించినప్పుడు టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఎవరు ఎక్కడైనా పర్యటించవచ్చునని తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. ప్రజల ఆగ్రహాన్ని గమనించిన టిఆర్ఎస్ జగన్ పర్యటనను అడ్డుకున్నది. అయితే అదే సమయంలో దళిత మహాజన నాయకుడు కత్తి పద్మారావు ఆహ్వానం మేరకు ప్రత్యేకాంధ్ర ఉద్యమ సభలో పాల్గొనడానికి విజయవాడ వెళతానని ప్రకటించడంపైనా తెలంగాణ వాదుల నుండి విమర్శలు చెలరేగాయి. జగన్‌ను అడ్డుకుంటామని చెబుతూ కెసిఆర్ అక్కడకు వెళ్లడంపై జెఏసి అభ్యంతరాలు చేయడంతో ఆయన వెళ్లడం మానుకున్నారంట.

అయితే జగన్‌ను అడ్డుకోవడానికి జెఏసి ఇచ్చిన పిలుపుకు అనూహ్య స్పందన రావడం, అందులో టిఆర్ఎస్ పాల్గొనడం, టిఆర్ఎస్ రాజకీయ పార్టీ కావడం, వారికి ఎమ్మెల్యేలు ఉండటం కారణంగా ఆ క్రెడిట్ వారికి పోయిందని జెఏసి భావిస్తున్నట్టుగా సమాచారం. జగన్ ఫీజు పోరును అడ్డుకోవడానికి జెఏసి పిలుపునివ్వక పోవచ్చు.కానీ ఉద్యమ పార్టీగా జగన్ ఫీజు పోరు సమయంలో దానిని అడ్డుకోగ పోగా దానిపై స్పందించక పోవడంతో జెఏసి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా జగన్ దగ్గరగా ఉండే ప్రజా సంఘాల నేతలు పలువురు జగన్‌ను కలిసి సంఘీభావం తెలపడం కూడా అనుమానాలకు తావిస్తోంది.

దానికి తోడుగా జగన్ మౌత్ అంబటి రాంబాబు ఇటీవల కెసిఆర్ పార్లమెంటు నియోజకవర్గం అయిన మహబూబ్‌నగర్‌లో పర్యటించి తమ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. జగన్ పార్టీ వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ వారు తెలంగాణలో యథేచ్ఛగా తిరుగుతున్నప్పటికీ టిఆర్ఎస్ సైలెంట్‌గా ఉంటుంది. అంతేకాదు జగన్‌ను వెన్నుదన్నుగా ఉంటున్న కొండా సురేఖ, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, గోనె ప్రకాశ్ రావులపై కూడా ఇంతవరకు ఘాటుగా స్పందించిన దాఖలాలు లేకపోవడం జెఏసిలోని పలువురు ప్రశ్నిస్తున్నట్టుగా టతెలుస్తోంది.

English summary
Telangana JAC is suspecting Telangana Rastra Samithi and TRS president K Chandrasekhar Rao attitude about Ex MP YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X