సముద్రంలో 4గురు విద్యార్థుల గల్లంతు: గాలిస్తున్న మత్స్యకారులు
Districts
oi-Srinivas G
By Srinivas
|
రాజమండ్రి: నలుగురు విద్యార్థులు సముద్రంలో గల్లంతైన సంఘటన తూర్పు గోదావరి జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. ఈ సంఘటన సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో చోటు చేసుకుంది. అంతర్వేది బీచ్‌లో కాలు జారీ ఓ విద్యార్థి సముద్రంలో పడగా మిగిలిన ముగ్గురు ఆ విద్యార్థిని రక్షించే ప్రయత్నలో అందులో పడినట్లుగా తెలుస్తోంది. గల్లంతయిన వారు ఫిరోజ్, వంశీ, కృష్ణారెడ్డి, సురేష్ గా తెలుస్తోంది. విద్యార్థులు గల్లంతయిన విషయం తెలిసిన స్థానిక మత్స్యకారులు వెంటనే స్పందించారు. గ్రూపులుగా ఆ విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
అందులో ఇద్దరు వ్యక్తులు బయట పడినట్టుగా సమాచారం. మరో ఇద్దరి కోసం మత్స్యకారులు విస్తృతంగా గాలిస్తున్నారు. అయితే ఈ విద్యార్థులు విజయవాడలోని లయోలా కాలేజికి చెందిన విద్యార్థులుగా తెలుస్తోంది.