కాగ్నిజెంట్ Q1 నికరలాభం 113.1మిలియన్ అమెరికా డాలర్లు

జనవరి - మార్చి - 2011లో కంపెనీ రెవెన్యూ 42.88 శాతం 1.37 బిలియన్ డాలర్లకు చేరింది. అంతకు ముందు ఏడాది 959.72 మిలియన్ డాలర్లు. రెండవ త్రైమాసికం తో కంపెనీ రెవెన్యూ 1.45 బిలియన్ డాలర్ల లక్ష్యంగా ముందుకు సాగుతా మని.. 2011 పూర్త య్యే నాటికి మొత్తం రెవెన్యూలో 29 శాతం వృద్ధిని సాధించి 5.92 బిలియన్ డాలర్ల మేరకు తీసుకువెళతామని ఆయన చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో తమ ముద్రను కొనసాగిస్తూ ముందుకు పోతామని నికర లాభంలో 19-20 శాతం స్థాయి టార్గెట్‌ను కొనసాగిస్తామని కాగ్నిజెంట్ చీఫ్ ఫైనాన్షియల్ ఆపరేటింగ్ ఆఫీసర్ గోర్డాన్ కోబన్ చెప్పారు. మార్చి 31, 2011 నాటికి కంపెనీ చేతిలో నగదు లేదా నగదుతో సమానమైన బాండ్లు 1.29 బిలియన్ డాలర్లు ఉన్నట్లు... ఈ త్రైమాసికంలో కంపెనీ 7,200 మందికి పైగా కొత్త ఉద్యోగులను తీసుకున్నట్లు తెలిపింది.












Click it and Unblock the Notifications