తీహార్ జైలుకు సురేష్ కల్మాడీ, 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ

కాగా గత మంగళవారం (ఏప్రిల్ 26వ తేదీ) సురేష్ కల్మాడీని సీబీఐ అధికారులు పాటియాల కోర్టుకు తీసుకువెళుతుండగా కోర్టు ఆవరణవద్ద మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి కల్మాడీపైకి చెప్పులు విసిరిన నేపథ్యంలో ఈసారి అలాంటి సంఘటనలు జరగకుండా కోర్టు ఆవరణలో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.కామన్‌వెల్త్ క్రీడల నిర్వాహక కమిటీ మాజీ ఛైర్మన్ సురేష్ కల్మాడీపై అవినీతి, మోసంపై కేసులు నమోదు, టైమింగ్ స్కోర్ రిజల్ట్ సిస్టమ్ కోసం స్విస్ కంపెనీకి కల్మాడీ అక్రమంగా కాంట్రాక్టులు కట్టబెట్టారని, దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు 95 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కల్మాడీని సీబీఐ అధికారులు సోమవారం (ఏప్రిల్ 25) అరెస్ట్ చేసిన విషయం విదితమే.












Click it and Unblock the Notifications