వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గూగుల్ క్రోమ్ విశిష్టతను తెలియజేస్తూ గూగుల్ టివి కమర్షియల్ యాడ్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Google Chrome
గూగుల్ ఏది చేసినా అందులో తన ప్రత్యేకతను కనబరుస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఉన్నటువంటి బ్రౌజర్ మార్కెట్‌లో నెంబర్ వన్ స్దానాన్ని కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో మార్కెట్‌లోకి ఓ వినూత్నమైన ఐడియాని ప్రయోగించింది. ఏమిటా ఆ ఐడియా అని అనుకుంటున్నారా... డియర్ సోఫి అనే కమర్షియల్ యాడ్‌ని రూపోందించింది. ఈ యాడ్‌లో ఫాదర్ తన బేబికి తన జీవితం మొత్తం ఈమెయల్ నోట్స్, ఫోటోస్, వీడియోస్ లాంటి పంపుతు ఉంటాడు. చూసేవారికి ఈ యాడ్ చాలా అందంగా ఇట్టే ఆకట్టుకునే విధంగా రూపోందించారు.

ఈ యాడ్ క్యాంపెయిన్ చేసినటుంటి గూగుల్ క్రియేటివ్ లాబ్ విపి ఆండీ బెర్నట్, యాడ్ ఏజెన్సీ హెడ్ బొంగ్లే హెర్టీ గురించి మాట్లాడుతూ యాడ్ చూడడానికి చాలా లుక్ అండ్ ఫీల్‌గా, సెంటిమెంటల్ మ్యూజిక్‌తోటి ఆకట్టువిధంగా విజువల్స్ కూడా రూపోందించామని తెలిపారు. ఇక్కడ మేము ప్రోడక్ట్‌ని హైలెట్ చేయడం కంటే కూడా గూగుల్ క్రోమ్ అనేది కంపెనీ అప్లికేషన్స్‌కి ఎలా ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతో రూపోందించామని అన్నారు. ముఖ్యంగా ఈ యాడ్ 90 సెకన్లలో జీమెయిల్, పికాసా, యూట్యూబ్ అప్లికేషన్స్ గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది.

గూగుల్ కంపెనీ నిర్వహించిన 'వెబ్ ఈజ్ వాట్ యూ మేక్ ఆఫ్ ఇట్' అనే క్యాంపెయిన్ గూగుల్ కంపెనీ ఇప్పటి వరకు నిర్వహించినటువంటి ఆఫ్‌లైన్ క్యాంపెయిన్‌లలో బాగా కమర్షియల్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించిందని ది న్యూయార్క్ టైమ్స్ వెల్లడించిన రిపోర్ట్స్‌లలో తేలింది. సాధారణంగా గూగుల్ కంపెనీ తన ప్రోడక్ట్స్ గురించి ఇంటర్నెట్‌లో కాకుండా పబ్లిసిటీ చేయడం కూడా ఇదే మొదటసారని అన్నారు. చాలా మంది కంప్యూటర్ ఓనర్స్‌కు కొత్త బ్రౌజర్స్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలియదని అన్నారు. ఈ యాడ్‌తో సెంటిమెంటల్ వాల్యూ పెరిగి గూగుల్ క్రోమ్ చూసేవారుగానీ, డౌన్‌లోడ్ చేసుకునే వారి సంఖ్య పెరుగుతుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

రాబోయే వారంలో గూగుల్ కంపెనీ మరిన్ని యాడ్స్ ఇంటర్నెట్‌లో విడుదల చేయనున్నాయి. గూగుల్ కంపెనీ విడుదల చేయనున్న యాడ్స్ మేక్ ఎ బ్లాగ్, మేక్ యాన్ అబ్జర్వేషన్, మేక్ ఎ డిక్లరేషన్ మొదలగునవి. గూగుల్ విడుదల చేసేటటువంటి ఈ ప్రతి యాడ్ అయిపోయిన తర్వాత ఓ పెద్ద బటన్ స్విచ్ టు ఎ న్యూ బ్రౌజర్, డౌన్ లోడ్ అని దర్శనమిస్తుంది.

English summary
Google has taken another step in the fight to dominate the consumer browser market, releasing its new ‘Dear Sophie’ commercial which shows a father chronicling the life of his daughter by sending email notes, photos and videos of her as she grows up.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X