• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ గురించి ఇప్పుడు తెలుగులో పూర్తి సమాచారం

By Nageswara Rao
|

Ubuntu Operating System
ఉబుంటు 11.04 28 ఏప్రిల్ 2011న విడుదలైంది. విండోస్ లాంటిది కొనుక్కొనవలసి వుండగా ఇది ఉచితంగా లభ్యమవుతుంది. ఇందులో మీకు కావలసిన చలనచిత్ర ప్లేయర్, సత్వర సందేశిని, కార్యాలయ సాఫ్ట్వేర్, ఆటలు అన్నీ ఉచితం. మూలాలు అందుబాటులో వున్నందున, దీనిలో మార్పులు చేయటానికి ఎవరైనా సహకరించవచ్చు. కార్యాలయాలలో వాడాలంటే కెనానికల్ సంస్థ మరియు ఇతర సంస్థల తోడ్పాటు కొనుక్కోవచ్చు. ఉచితంగా వాడాలన్నా మీ తోటి వాడుకరుల మెయిలింగ్ లిస్టులు, వెబ్సైట్లు ద్వారా సహాయపడుతుంటారు.

ఈ విడుదలలో ఒక కొత్తరకం అంతర్వర్తి పరిచయం అవుతుండగా, తెలుగు తోడ్పాటు ప్రారంభం నుండి (డివిడి ప్రవేశపెట్టి బూట్ చేయడం నుండి) ముగింపు వరకు వుండటం ప్రథమం. బహుశా డిబియన్ మరియు డెబియన్ ఆధారిత పంపకాలను తప్పించి మిగతా లినక్స్ పంపకాలలో లేదనుకుంటాను. ఇక ఇప్పుడు ఇంగ్లీషు అంతగా రాని పిల్లలు, పెద్దలు, అందరూ దర్జాగా కంప్యూటర్ వాడవచ్చు. తెలుగుతో పాటు కన్నడం కూడా తోడ్పాటు లభించటంతో ఇప్పుడు భారతదేశ భాషలలో పది భాషలలో అందుబాటులోకి వచ్చింది.

ఉబుంటు విడుదలలో బహుళ స్పర్శ సాంకేతిక సౌలభ్యం వుంది. అంటే మౌస్ తో వాడుకోవటం పాతబడే రోజులు దగ్గరయ్యాయి. చేతి వేళ్లతో రకరకాల పనులు చేయవచ్చు. దీనికి కావలసిన ట్రాక్ పాడ్ కొత్తగా వచ్చే లాప్టాప్, నెట్బుక్, టాబ్లెట్ లలో లభ్యమవుతుంది. బ్లూటూత్ సౌకర్యం వున్న లాప్టాప్ వాడుకరులు యాపిల్ ట్రాక్ పాడ్ కొనుక్కొని ఈ కొత్త సౌలభ్యాన్ని ఉపయోగించుకోవచ్చు.

దాదాపు పది ఏళ్ల నుండి తెలుగు స్థానికీకరణం గురించి జరుగుతున్న కృషికి ఇదొక మైలు రాయు. 2005 లో తెలుగు తోడ్పాటు మొదలైనా, ఫైర్ఫాక్స్, నాణ్యత గల తెలుగు కార్యాలయ సాఫ్ట్వేర్ (లిబ్రెఆఫీస్) లభ్యం కావటానికి ఇంత సమయం పట్టింది. మీరు ఇప్పటికే విండోస్ వాడుతున్నా, దీనిని రెండవ నిర్వహణ వ్యవస్థగా లేక దానిపై అనువర్తనంలాగా వాడటానికి అవకాశముంది. దీనిని గురించి తెలుగులో screenshots తో సులభంగా అర్థమయ్యే రీతిలో ఎలెక్ట్రానిక్ పుస్తకం తయారు చేసి అందుబాటులోకి తేవడమైనది.

English summary
Canonical today announced the release of Ubuntu a fast-growing open-source operating system on April 28, 2011 for public download. Ubuntu 11.04 stands out from its competitors as a genuine free alternative to Windows, allowing users to personalize their PC with free and paid apps in a way that’s proven hugely popular in the smartphone and tablet market.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more