ప్రత్యేక ప్రజెంటేషన్‌లో యానిమేషన్‌ ఇవ్వడం తెలిసిందే. మరి స్త్లెడ్‌కి కూడా యానిమేషన్‌ ఎఫెక్ట్‌ ఇవ్వాలంటే? మెనూబార్‌లోని Slide Show-> Slide Transition ఎంచుకోండి. కుడివైపు బాక్స్‌లో యానిమేషన్‌ ఎఫెక్ట్‌లు కనిపిస్తాయి. వాటిపై క్లిక్‌ చేస్తే స్త్లెడ్‌ యానిమేట్‌ అవుతుంది. యానిమేషన్‌ సౌండ్‌, వేగాన్ని మార్చాలంటే Modify Transition లోని Speed, Sound ఎంచుకుంటే సరి. ప్లేపై క్లిక్‌ చేసి యానిమేషన్‌ను చూడొచ్చు. ఆటోమాటిక్‌గా స్త్లెడ్‌ ఎఫెక్ట్‌ అప్త్లె అవ్వాలంటే Automatically Afterలో సమయాన్ని ఎంచుకోండి.