వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కోర్టులో కనిమొళిని చూసి కంటతడి పెట్టుకున్న ఆమె తల్లి

ఈ సందర్భంగా కోర్టులో కనిమొళిని చూసి రజాతి అమ్మల్ కన్నీరు పెట్టుకున్నారు. 2జీ కుంభకోణం కేసులో డిఎంకె అధినేత కరుణానిధి కుమార్తెకు సంబంధం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం కనిమొళిని అరెస్టు చేయాల్సిందిగా కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. పాటియాలా హౌజ్ ప్రాంగణంలోని ప్రత్యేక కోర్టులో వీరిద్దరినీ హాజరు పరిచారు.
కోర్టులో సిబిఐ (సెంట్రల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్) ప్రత్యేక న్యాయవాది ఓ.పి. సోనీ మాట్లాడుతూ.. ఈ కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకొని, నిందితులు బెయిల్‌పై విడుదలైతే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున, వారికి బెయిల్ నిరాకరించడమైనదని అన్నారు.