యువతి గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది: తానూ ఆత్మహత్య ప్రయత్నం

ఈ నేపథ్యంలో ఆగ్రహం చెందిన శ్రీనివాస్ శుక్రవారం నడిరోడ్డు పైనే మున్సిపాలిటీ ఈ సేవా కేంద్రం దగ్గర కత్తితో గొంతు కోశాడు. అనంతరం అతను ఆత్మహత్య చేసుకుందామని గాజుపెంకుతో కోసుకున్నాడు. గమనించిన స్థానికులు వారిద్దరిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే శ్రీలత మరిణించగా, శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉంది. కాగా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
కాగా ఖమ్మం జిల్లాలో ఇలాంటి ప్రేమ దాడి సంఘటనలు నెలలో ఇది రెండోది కావడం దారుణం. ఇటీవలె జిల్లా కేంద్రంలోని అనిబీసెంట్ కళాశాలలో బిఇడి చదువుతున్న ఓ యువతిని ఓ ప్రేమోన్మాది ఆమెను చున్నీతో ఉరివేసి హత్య చేశాడు.