ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పార్టీలోకి జలగం వెంగళరావు కుమారుడు జలగం వెంకటరావు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
ఖమ్మం‌: మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు, కాంగ్రెసు పార్టీ సభ్యుడు జలగం వెంకటరావు వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం శాసనసభా స్థానం నుంచి తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేయడంతో కాంగ్రెసు నుంచి ఆయన సస్పెన్షన్‌కు గురయ్యారు. వామపక్షాలు, తెలుగుదేశం పార్టీలు బలంగా ఉన్న ఖమ్మం జిల్లాలో జలగం వెంగళరావు చేరిక వల్ల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పుంజుకుంటుందని భావిస్తున్నారు.

గత ఎన్నికల్లో ఖమ్మం శాసనసభా స్థానంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర రావుపై వెంకటరావు కేవలం 2 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఖమ్మం జిల్లాలో జలగం వెంకటరావుకు తగిన అనుచరగణం, సొంత బలం ఉన్నాయి. జలగం వెంకటరావు చేరికతో జలగం వెంగళరావు కుటుంబ సభ్యులంతా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పరిధిలోకి వస్తారని అనుకుంటున్నారు. ఆయన సోదరుడు జలగం ప్రసాద రావు రెండు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై కొద్ది కాలం మంత్రిగా కూడా పనిచేశారు.

కాంగ్రెసు పార్టీ నాయకురాలు రేణుకా చౌదరి వర్గానికి, జలగం వెంకటరావు వర్గానికి ఖమ్మం జిల్లాలో చాలా కాలంగా పడడం లేదు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో రేణుకా చౌదరికి మద్దతు లభించింది. కాంగ్రెసు అధిష్టానం నుంచి కూడా ఆమెకు తగిన మద్దతు లభించడంతో జలగం కుటుంబ సభ్యులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. జలగం వెంకటరావుకు వైయస్సార్ కాంగ్రెసులో రాష్ట్ర స్థాయి పదవి లభించే అవకాశాలున్నట్లు కూడా చెబుతున్నారు.

English summary
Jalagam Venkata Rao, the son of former chief minister Jalagam Venkat Rao, is all set to join hands with YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X