లోకేష్ పేరు ఎత్తకండి, జగన్ వర్గం లిస్టు ఇవ్వండి: చంద్రబాబు

జిల్లాలో వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ వేపు మొగ్గు చూపుతున్న పార్టీ నాయకుల పేర్లు తయారు చేయాలని ఆయన జిల్లా నేతలకు ఆదేశించారు. వారిపై పార్టీ పరమైన చర్యలు తీసుకొనడానికి వెనుకాడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చిన క్యాడర్ సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. స్థానిక ఎన్నికలలో మంచి ఫలితాలు సాధించాలని చెప్పారు. తిరుపతి, చిత్తూరు నియోజకవర్గాలకు ఇంచార్జులను తర్వాత నియమిస్తానని చెప్పారు. కాగా ఎమ్మెల్యేలు బొజ్జల గోపాలకృష్ణ, గాలి ముద్దు కృష్ణమనాయుడు చంద్రబాబు సమావేశం జరుగుతున్న సమయంలోనే ముభావంగా బయటకు వచ్చారు. అయితే వారు మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు. కాగా అంతకుముందు ఆయన తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.












Click it and Unblock the Notifications