మందుపాతర పేల్చిన నక్సలైట్లు, చత్తీస్‌గడ్‌లో పది మంది జవాన్ల మృతి

సంఘటన జరిగిన స్థలం రాయపూర్‌కు 400 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దాడిలో పాల్గొన్న మావోయిస్టుల్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. గాలింపు చర్యల కోసం రెండు వాహనాల్లో పోలీసులు వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది. మృతుల్లో ఏడుగురు స్పెషల్ పోలీసు ఆఫీసర్లు, ముగ్గురు రాష్ట్ర పోలీసు అధికారులు ఉన్నారు. బస్తర్ ప్రాంతంలో ఇటీవల మావోయిస్టులు ఐదుగురు పోలీసులను కాల్చి చంపారు.












Click it and Unblock the Notifications