నిరుపేదలపై ఔషద ప్రయోగాలపై విచారణ: డిఎల్ రవీంద్రారెడ్డి

ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బయో మెడికల్ వ్యర్థాలపై అజాగ్రత్తగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బయో మెడికల్ వ్యర్థాలను సమగ్రంగా డిస్పోజ్ చేసేందుకు జపాన్ కంపెనీతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బయో మెడికల్ వ్యర్థాల తరలింపునకు ప్రత్యేక టెండర్లు పిలిచినా ఇందులో అవకతవకలు చోటుచేసుకున్నాయని దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తున్నామని మంత్రి చెప్పారు. ఔషధ ప్రయోగాలపై కొన్ని చట్టాలున్నా అవి పకడ్బందీగా అమలు కావడం లేదని చెప్పారు
కాగా నిరుపేదలపై ఔషధ ప్రయోగాలకు నిరసనగా పిడుగురాళ్లలో సిపిఐ ర్యాలీ నిర్వహించింది. జంతువులపై చేయాల్సిన ప్రయోగాలను మనుషులపై చేస్తూ అమానుషంగా ప్రవర్తిస్తున్నారని సిపిఐ నేతలు మండిపడ్డారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం వెంటనే చొరవ చూపాలని కోరారు.