సత్యసాయి బాబా మృతికి సత్యజిత్ కారణం: ఆదికేశవులు నాయుడు
Districts
oi-Srinivas G
By Srinivas
|
చిత్తూరు: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వ్యక్తిగత సహాయకుడు సత్యజిత్‌పై ప్రభుత్వం విచారణ చేపట్టాలని మాజీ పార్లమెంటు సభ్యుడు, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ ఆదికేశవులు నాయుడు శనివారం ప్రభుత్వాన్ని కోరారు. సత్యసాయి మృతికి సత్యజిత్ కారణం కావచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. సత్యసాయి మరణానికి ముందు, తర్వాత ప్రశాంతి నిలయంలో జరిగిన పరిణామాలపై వెంటనే ప్రభుత్వం విచారణ జరిపించాలని ఆయన అన్నారు. తాను ఇప్పటికే ప్రభుత్వాన్ని విచారణ కోసం కోరానని అన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించాలని అన్నారు. యజుర్వేద మందిరం నుండి సొమ్ము మాయం కావడం వెనుక సత్యజిత్ హస్తం ఉండవచ్చున్న అనుమానం తనకు తలెత్తుతోందని ఆదికేశవులు నాయుడు అన్నారు. ఆ దిశలో కూడా ఆయనపై విచారణ చేయాలన్నారు. యజుర్ మందిరంలో చాలా ఆస్తులు ఉండాలని ఆయన అన్నారు.