జగన్‌కు మద్దతు మాత్రమే!: నల్లపురెడ్డి, వివరణ కోసం గడువు

ప్రజా సంక్షేమం కోసం మంచి పథకాలు ఎవరు ప్రవేశ పెట్టినా తాను పొగిడానని చెప్పారు. కాగా నల్లపురెడ్డిపై అనర్హత వేటు వేయాలని టిడిపి కోరిన విషయం తెలిసిందే. సోమవారం టిడిపి స్పీకర్ నాదెండ్ల మనోహర్ ముందు తన వాదనలు వినిపించింది. మంగళవారం ప్రసన్న కుమార్ తన వాదనలు స్పీకర్ ముందు వినిపించారు. అయితే పూర్తి వివరణ కోసం రెండు వారాల గడువు కోరారు. దానికి స్పీకర్ అంగీకరించారు.
నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పార్టీ విప్ దూళిపాళ్ల నరేంద్ర చౌదరి అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఇతర పార్టీల నాయకులను ప్రశంసించకూడదనే విషయాన్ని ప్రసన్నకుమార్ రెడ్డి గ్రహించాలని ఆయన అన్నారు. బహిష్కరణ వేటులో జాప్యం జరగాలనే ఉద్దేశంతోనే ప్రసన్న కుమార్ రెడ్డి గడువు కోరుతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications