ప్రాంతీయ మండలిని వ్యతిరేకిస్తాం: ఎర్రబెల్లి

Errabelli Dayakar Rao
వరంగల్: హైదరాబాదుతో కలిసిన తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం అన్నారు. గత డిసెంబర్ 9న చేసిన ప్రకటనకు కేంద్రం క్టటుబడి ఉండాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం ప్రత్యేక సహాయాలు, ప్రాంతీయ బోర్డులు తమకు అవసరం లేదన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తే చాలన్నారు. తెలంగాణపై కేంద్రం వెంటనే నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టును అడ్డుకోవాలని ఎర్రబెల్లి కోరారు. బాబ్లీ ప్రాజెక్టు చేపడితే తెలంగాణ ఏడారి అయిపోతుందన్నారు. బాబ్లీపై వారం లోగా ప్రభుత్వం అఖిలపక్షాన్ని నిర్వహించాలని అన్నరు. లేదంటే తెలుగుదేశం పార్టీ అధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+