తల తెగినా తెలంగాణ ఉద్యమం ఆగదు: కెసిఆర్

ప్రాంతీయ మండలి వేస్తే తెలంగాణ ప్రజలు కాంగ్రెసు పార్టీ తెలంగాణ ప్రజలు బంగాళాఖాతంలో కలుపుతారని ఆయన అన్నారు. డిసెంబర్ 9వ తేదీ ప్రకటనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉండకపోతే తెలంగాణ భగ్గుమంటుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాము పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. పోరాటం చేస్తే ఏం చేస్తారు, తననూ కోదండరామ్‌నూ జైల్లో పెడతారాని, చంపేస్తారా అని, అయినా ఉద్యమం ఆగదని ఆయన అన్నారు. ప్రాంతీయ మండళ్ల ప్రయోజనం శూన్యమని ఆయన అన్నారు. తెలంగాణ ఇస్తామని ప్రధాని మన్మోహన్ సింగ్ మాట ఇచ్చారని, ఆ మాటకు కట్టుబడి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పూనుకోవాలని ఆయన అన్నారు.
కుదరనప్పుడు రెండు ప్రాంతాలు విడిపోవచ్చునని భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూయే చెప్పారని బిజెపి నాయకురాలు నజ్మా హెప్తుల్లా అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ పార్టీ మద్దతు ఎప్పటికీ ఉంటుందని ఆమె చెప్పారు. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని ఆమె అన్నారు. తెలంగాణ ఉద్యమం ఎవరకీ వ్యతిరేకం కాదని ఆమె అన్నారు. తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ పాత్ర మరువలేనదని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications