లగడపాటిపై స్పీకర్‌కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

Lagadapati Rajagopal
హైదరాబాద్: విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌పై తెలంగాణ ప్రజాప్రతినిధులు అందరూ కలిసి బుధవారం సభాపతి నాదెండ్ల మనోహర్‌కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. లగడపాటిపై సభా హక్కుల నోటీసు ఇచ్చిన పార్టీలలో కాంగ్రెసు, తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ, సిపిఐ పార్టీలు ఉన్నాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర శాసనసభ్యులను కించపరిచే విధంగా లగడపాటి వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు. గతంలో 14ఎఫ్ పై శాసనసభ్యులు అంతా తీర్మానం చేశారని గుర్తు చేశారు.

శాసనసభలో చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా మాట్లాడటం ద్వారా లగడపాటి ఒక పార్లమెంటు సభ్యుడిగా ఉండి సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డాడని అన్నారు. లగడపాటి చేసిన వ్యాఖ్యలు సభాపతికి చెప్పామన్నారు. ఆయనపై లోకసభ సభాపతికి కూడా ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఆయనకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు అంద జేయాలని స్పీకర్‌ను కోరినట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+