తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేల రాజీనామా, మారిన వైఖరి

టిడిపి శాసనసభ్యులు అందరూ వెళ్లి డిప్యూటీ స్పీకర్‌కు తమ రాజీనామా పత్రాలను సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తాము స్పీకర్ ఫార్మాట్ ప్రకారమే రాజీనామాలు సమర్పించినట్లు చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సంపాదించాలనే కోరికతో తాము రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ కోసం రాజీనామా సంక్షోభం సృష్టించడానికి తాము సిద్ధమని గతంలో ప్రకటించిన మాదిరిగానే ఇప్పుడు సిద్ధంగా ఉన్నామన్నారు. నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల కోసమే రాజీనామాలకు సిద్దపడ్డట్టు చెప్పారు. తెలుగుదేశం పార్టీని విమర్శించే నేతలు ఇప్పటికైనా టిడిపి చిత్తశుద్ధిని గుర్తు పెట్టుకోవాలన్నారు. టిడిపిని విమర్శించడం మానుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications