హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ సెగ, రాజీనామా బాటలో సిపిఐ ఎమ్మెల్యేలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gunda Mallesh
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సిపిఐ సైతం రాజీనామాలకు సిద్దమంటోంది. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల రాజీనామాల నేపథ్యంలో అవసరమైతే సిపిఐ రాజీనామా బాట పట్టాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. తమ పార్టీ తెలంగాణకు కట్టబడి ఉందని తాము రాజీనామా చేయవలసిన అవసరం లేనప్పటికీ అవసరం వస్తే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని సిపిఐ శాసనసభా పక్షనేత గుండా మల్లేష్ మంగళవారం చెప్పారు. తెలంగాణ విషయంలో అన్ని పార్టీలకు స్పష్టమైన వైఖరి ఉందని కేవలం తెలుగుదేశం పార్టీ, కాంగ్రెసు పార్టీల వైఖరి స్పష్టంగా లేదని చెప్పారు. ఇప్పటికే సిపిఐ నేతలు తెలంగాణ కోసం ప్రత్యక్ష పోరాటంలో ఉంటున్నారని చెప్పారు. అయినా రాజీనామాలకు వెనకాడం అని చెప్పారు. అయితే తమ రాష్ట్రకార్యదర్శి నారాయణ అమెరికా పర్యటన నుండి న్యూఢిల్లీ వచ్చారని చెప్పారు. ఆయన వద్ద తమ రాజీనామాలు ఉన్నాయని చెప్పారు.

నారాయణ హైదరాబాద్ వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అవసరమైతే నేరుగా సభాపతికి రాజీనామాలు అందజేస్తామని చెప్పారు. కాగా పెద్దపల్లి నియోజకవర్గం నుండి గుండా మల్లేష్, వైరా నియోజక వర్గం నుండి చంద్రావతి, కొత్తగూడెం నుండి కూనంనేని సాంబశివరావు, మునుగోడు నుండి యాదగిరి రావు సిపిఐ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సిపిఐ ఎమ్మెల్యేలు సురవరం సుధాకర్ రెడ్డితో సమావేశం అయ్యారు.

English summary
CPI mlas may resign for telangana. CPILP Gunda Mallesh said today that they will take decision after Narayana meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X